భారత దేశం లో రుతుపవనాలు ప్రారంభం అవడానికి ఇంకా ఎంతో సమయం లేదు.రుతుపవనాలు ప్రారంభం కాగానే సాధారణ ఇన్ఫెక్షన్ లే అధిక సంఖ్యలో మొదలయిపోతాయి.అలాంటప్పుడు కరోనా కూడా అదేవిధం గా పెరిగిపోయే అవకాశం ఉందని కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేసారు.సాధారణం గా రుతుపవనాలు జూన్ తో మొదలయి సెప్టెంబర్ వారకు కొనసాగుతాయి.దక్షిణాసియాలో వరదలు కూడా ముంచెత్తే అవకాశం ఉంటుంది.కాబట్టి ఈ సీజన్లో చాల సులువుగా కరోనా నిజంగానే తగ్గుముఖం పట్టిందా అనే విషయం మీద మనం ఒక అంచనాకు రావచ్చు.
ఇక భారతీయులలో ఇప్పటికి కూడా కోవిద్-19 సోకని వాళ్ళు చాల మంది ఉన్నారు.వారికికొత్త రకం వైరస్ వ్యాపించే అవకాశం చాల ఎక్కువగా ఉంది.ఎందుకంటే వారి శరీరం లో యాంటీ బాడీ లు ఉండవు కాబట్టి. జనవరి చివరి వారంవరకు బ్రిటన్ కరోనా కేసు లు 160 వరకు నమోదు అయ్యాయి.ఇంకా వచ్చిన కొత్త వైరస్ వ్యాపించింది అనేది ఇంకా తెలియలేదు.బ్రిటన్ వైరస్ మొదట సెప్టెంబర్ లో గుర్తించిన కూడా ఆ తర్వాత రెండు నెలల వరకు అది పూర్తి స్థాయి లో కనిపించలేదు. ఆ తర్వాత నుండి 50 దేశాలలో ఆ వైరస్ ను గుర్తించారు.కరోనా వైరస్ కొత్త రకాలుగా రావడం వల్ల మన లెక్కలన్నీ తారుమారు అవుతాయి కాబట్టి ప్రజలు,ప్రభుత్వం చాలా అప్రమత్తం గా ఉండవలసిన అవసరం ఎంత అయినా ఉంది.
మన దేశంలో వాక్సినేషన్ ఇంకా వేగవంతం చేయడం వల్ల సెకండ్ వేవ్ లో కరోనా తీవ్రత కొంచం అయినా తగ్గించే అవకాశం ఉంది.నెలరోజులలో 60,00,000 టీకాలు ఇచ్చారు.ఆగష్టు ముగిసేనాటికి మూడు కోట్ల మందికి టీకాలు వేయాలని ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకుంది.ఇప్పుడు ప్రభుత్వం,ప్రజలు ఈ విషయం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఎంతయినా ఉంది.జనం పెద్ద సంఖ్యలో గుమికూడకుండా,రద్దీ ప్రాంతాలకి దూరంగా ఉంటూ,పేస్ మాస్క్ ఖశ్చితం గా వినియోగిస్తూ, చేతులు పరిశుభ్రం గా ఉంచుకోవడం ద్వారా కొంచం అయినా వైరస్ నుండి విముక్తి దొరికే అవకాశం ఉందని డాక్టర్ లు, శాస్త్రవేత్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.