సీఎం కేసీఆర్​ జీవిత చరిత్రపై త్రీడీ గ్రాఫిక్స్​తో డాక్యుమెంటరీని రూపొందించామని.. కేసీఆర్​ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న దానిని విడుదల చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ చెప్పారు. హైదరాబాద్​లోని జలవిహార్​లో నిర్వహించే కేసీఆర్​ పుట్టినరోజు వేడుకల్లో దానిని ప్రదర్శిస్తామని తెలిపారు. ఈ డాక్యుమెంటరీ టీజర్​ను తలసాని సోమవారం విడుదల చేశారు. కేసీఆర్​ బాల్యం, రాజకీయ ప్రస్థానం, తెలంగాణ ఉద్యమం నేపథ్యాన్ని వివరిస్తూ 30 నిమిషాల త్రీడీ డాక్యుమెంటరీని రూపొందించామని చెప్పారు. దీనితోపాటు ప్రత్యేకంగా రూపొందించిన ఐదు పాటలను కూడా జన్మదిన వేడుకల్లో ప్రదర్శిస్తామని తెలిపారు