వార్తలు (News)

మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష భగ్నం

విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుగారు చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆరు రోజులుగా పల్లా శ్రీనివాసరావుగారు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. పల్లా శ్రీనివాసరావుగారు కి సంఘీభావం తెలిపేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మంగళవారం విశాఖ రానున్నారు.

చంద్రబాబు నగరానికి రావడానికి ముందే పోలీసులు పల్లా దీక్షను భగ్నం చేసి దీక్ష శిబిరం నుంచి ఆయనను బలవంతంగా కృషి ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరం ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తరలింపును అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆసుపత్రిలోనే పల్లా శ్రీనివాసరావుగారు దీక్షను కొనసాగిస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు, అభిమానులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. పల్లా శ్రీనివాసరావుగారు పరిస్ధితిని చూసి మహిళా కార్యకర్తలు కంటతడిపెడుతున్నారు.

మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న పల్లా శ్రీనివాసరావుకు అమరావతి రైతులు కూడా మద్దతు తెలిపారు. సోమవారం అర్ధరాత్రి విశాఖ చేరుకున్న మహిళా రైతులు నేరుగా దీక్షా శిబిరానికి వెళ్లి శ్రీనివాస్ రావు మద్దతు ప్రకటించి, సంఘీభావం తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.