చెన్నై లో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో భారత్ 317 పరుగుల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే! దీనితో మొత్తం ఫార్మాట్ లో టీంఇండియా ఆరవసారి ఇంత భారీ తేడా తో గెలుపొందింది. అలాగే భారత్ లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ గా విరాట్ కోహ్లీ మాజీ కెప్టెన్ ధోని తో సమానం గా నిలిచారు.
విరాట్ కోహ్లీ ఆధ్వర్యం లో టీం ఇండియా ఇప్పటివరకు మొత్తం 28 టెస్ట్ లలో ఆడగా 21 విజయాలు సొంతం చేసుకోవడం విశేషం.మిగిలిన ఏడు మ్యాచ్లలో రెండు ఓటమి చవి చూడగా,5 మ్యాచ్ లు డ్రా గా ముగిసాయి.ప్రస్తుతం ఈ సిరీస్ ని భారత్ 1-1 తో సమం చేసుకుంది.ఆ తర్వాత అహ్మదాబాద్ లో ఈ నెల 24 నుండి ప్రారంభం కానుంది.