“న్యాయం జరిగే వరకు మా నినాదం ఆగదు. ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’.
గాంధీ విగ్రహం నుండి స్టీల్ ప్లాంట్ గేటు వరకు నిర్వహించే పాదయాత్రలో
మా అడుగుల చప్పుడు, మా నిరసన కంఠాల హోరు ఢిల్లీకి వినపడేలా చేస్తాం. కోట్లాది ఆంధ్రుల ఆశను సజీవంగా నిలుపుతాం” అని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై విజయ సాయి రెడ్డి వ్యాఖ్యానించారు.