సోమవారం రాత్రి ఒడిశాలోని బలరాంపురం వద్ద ప్రైవేటు బస్సు ఢీకొని ఇచ్ఛాపురం పట్టణం లాలాపేటకు చెందిన టెంక లోకనాథం(37) మృతిచెందారు. ఆ సమయంలో ఆయనతో పాటు ఎండీ కఫురుద్దీన్‌ ద్విచక్రవాహనంపై ఉండటంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. లోకనాథం లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ, భార్య, ముగ్గురు కుమార్తెలను పోషిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన కఫురుద్దీన్‌కు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో ప్రథమచికిత్స చేసి, మెరుగైన వైద్యంకోసం ‘108’లో బ్రహ్మపుర వైద్య కళాశాలకు తరలించారు. ఇంకా పోలీస్ దర్యాప్తు కొనసాగుతుంది.