మహారాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కరోనా కేసులు పెరిగిపోవడంతో కట్టడి కోసం ప్రభుత్వ యంత్రాంగం కఠిన చర్యలు తీసుకుని, పాజిటివ్ వచ్చిన వారిని ప్రత్యేక సంరక్షణ కేంద్రంలో ఉంచి చికిత్స చేయిస్తోంది. అయితే పుణెలోని యరాండవాణె కొవిడ్ కేర్ సెంటర్లో 18ఏళ్ల యువతికి చికిత్స అందిస్తుండగా, ఆ కేంద్రంలో ఉండటం ఇష్టం లేక ఆ యువతి అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నించింది. ఆ భవనం కిటికీ ఊచల నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించి మధ్యలో ఇరుక్కుపోయి బయటకు రాలేక, లోపలకు వెళ్లలేక నరకయాతన అనుభవించిన ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఆమె కేకలు విన్న కొవిడ్ కేంద్రం నిర్వాహకులు పరిస్థితిని గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక హైడ్రాలిక్ కట్టర్ సాయంతో కిటికీ ఊచలను కత్తిరించి యువతిని కాపాడారు.