నెల్లూరు జిల్లా కోవూరు సాయిబాబా ఆలయం వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో అటువైపు వచ్చిన ఒక కారులో సోదాలు చేయగా రూ.కోటి నగదు కనిపించింది. ఆ కారు నెల్లూరు నుంచి గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్తున్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి పత్రాలు చూపమని అడగగా వారికి సరైన పత్రాలు చూపించలేదు. దీంతో పోలీసులు ఆ నగదును సీజ్‌ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.