టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్, ఎప్పట్లాగే ఓపెనర్లు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. పవర్ ప్లే ఓవర్లో అత్యధిక పరుగులు సాధించే అవకాశం ఉన్నా కనీస ప్రణాళిక లేక సగం మ్యాచ్ మొదటి 5 ఓవర్లలోనే చేజార్చుకుంటుంది.నిలకడ కలిగిన ఓపెనర్ లు దొరికేవరకు భారత్ పరిస్థితి ఇదేనేమో! ఫామ్ లో ఉన్న స్టార్ ఆటగాళ్లు అంతా బెంచ్‌కే పరిమితం అవ్వడం కూడా ఈ దుస్థితికి కారణమేమో!
మొతేరాలో తోటి ఆటగాళ్లు తక్కువ స్కోర్లకే చతికిలపడిన పిచ్ పై విరాట్ కోహ్లీ తనదైన శైలి లో పరుగులు రాబట్టారు. ఇంగ్లాండ్ పేసర్ల వేగాన్ని కూడా తనకు అనుగుణంగా మలుచుకుని చెలరేగిపోయారు. బౌండరీలు, కళ్లుచెదిరే సిక్సర్లుతో వరుసగా రెండో అర్ధశతకం చేశారు. దాంతో 20 ఓవర్లకు భారత్ 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (25; 20 బంతుల్లో 3×4) కాసేపు అలరించారు. హార్దిక్ (17; 15 బంతుల్లో 2×6) ఫర్వాలేదనిపించారు. మార్క్‌వుడ్ (3/31) బంతులకు రాహుల్ (0), ఇషాన్ కిషన్ (4), రోహిత్ (15) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు.