దైవ భక్తుల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం పంచదేవాలయం టూర్ పేరుతో సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో తిరుమలలోని శ్రీవారి దర్శనంతో పాటు తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి వంటి పుణ్య క్షేత్రాలను దర్శనం చేసుకోవచ్చు.

తిరుపతి నుండి ఈ ప్యాకేజీ మొదలవుతుంది. ఇది 1 రాత్రి, 2 రోజుల ప్రత్యేక టూర్ ప్యాకేజీ. ఈ ప్యాకేజీ లో ట్రిపుల్ ఆక్యుపెన్సీ(ముగ్గరు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కొరికి) ధర రూ.5,270 కాగా, డబుల్ ఆక్యుపెన్సీ(ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటే ఒక్కొరికి) ధర రూ.7,010, సింగిల్ ఆక్యుపెన్సీ (ఒకరు మాత్రమే) ధర రూ.11,750 ఉంటాయి.

ఈ ప్యాకేజీలో తిరుపతిలో ఒక రోజు అకామడేషన్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, తిరుచానూర్, శ్రీనివాస మంగాపురం, కాణిపాకం, శ్రీకాళహస్తి ఆలయాల్లో దర్శనంతో పాటు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ అన్నీ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ ప్రతీరోజు అందుబాటులో ఉంటుంది.
మరిన్ని వివరాల కోసం ఐఆర్‌సీటీసీ టూరిజం వెబ్‌సైట్‌లో చూడండి.