వార్తలు (News)

మరోసారి పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద మంటలు

జంట నగరాల్లో ట్రాఫిక్ పరంగా కీలకమైన పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. ఫ్లైఓవర్ పిల్లర్లపై నుంచి మంటలు ఎగసిపడుతూ భీతావాహ దృశ్యాలు కనిపించాయి. గడిచిన వారం రోజుల్లో ఈ సంఘటన జరగడం ఇది రెండవసారి.

ఫ్లైఓవర్ మీదుగా మంటలు, పొగలు వ్యాపించడంతో ఆ సమయంలో అక్కడున్న వాహనదారులు, దుకాణదారులు హడలిపోయారు. ప్రమాదం నేపథ్యంలో పంజాగుట్ట మార్గంలో పోలీసులు వాహనాల రాకపోకలను కాసేపు నిలిపివేశారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి సాధారణ స్థాయికి చేరింది. సమాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది.. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు.

గత శుక్రవారం(మార్చి 12)న కూడా సరిగ్గా ఇలాగే, దాదాపు మధ్యాహ్నం సమయంలోనే పంజాగుట్ట ఫ్లై ఓవర్ వద్ద అగ్నప్రమాదం సంభవించింది. కాగ,

మొన్నటి ఘటనలో ఫ్లై ఓవ‌ర్ కింద ఫైబ‌ర్ డెక‌రేష‌న్‌లో మంట‌లు చెల‌రేగడంతో మంటలు వ్యాపించినట్లు వెల్లడికాగా, తాజా ప్ర‌మాదం కూడా షార్ట్ సర్క్యూట్ కార‌ణంగా జ‌రిగిందా? లేక ఎవ‌రైనా నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ లో ఎండలు తీవ్రతరమవుతూ ఉండడంతో తరచుగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.