ఆదివారం రాత్రి పద్మాజివాడి గ్రామానికి చెందిన మొర అజయ్‌కుమార్‌ తండ్రి చనిపోవడంతో తల్లితో కలసి ఆయన బంధువుల ఇంటికి వెళ్లారు. దుండగులు బీరువా తాళం పగులగొట్టి రూ.6లక్షల నగదుతో పాటు 20 గ్రాముల బంగారు నగలు, రూ.40 వేల విలువైన వెండి వస్తువులు ఎత్తుకెళ్లారు.

కొన్ని రోజుల కిందట తల్లి చనిపోవడంతో సోదరులిద్దరూ బంధువుల ఇళ్లకు నిద్రకు వెళ్లగా మ్యాదరి రవికి చెందిన రూ.లక్ష నగదు, తులంన్నర బంగారం.. మ్యాదరి సుధాకర్‌కు చెందిన 15 తులాల వెండి.. వడ్ల పుష్ప కామారెడ్డిలోని తమ్ముడి ఇంటికి వెళ్లగా రూ.20 వేల నగదు, తులం బంగారం దోచుకెళ్లారు. తాళం వేసిన ఇళ్లే వీరి లక్ష్యం. ఎవరి ఇల్లు తాళం వేసి ఉందొ గమనించి ఇల్లు మొత్తం దోచుకెళ్తారు. పోలీసులు, రాత్రి గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.