వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సోమవారం రాత్రి 8 గంటల వరకు 60,263 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తే వాటిలో 204 పాజిటివ్‌ కేసులు నమోదుకావడంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,522కి చేరింది.

నిన్న కొవిడ్‌తో ఇద్దరు మృతి చెందడంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1656కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 170 మంది కోలుకోవడంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,97,851కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 2,015 ఉంది. వీరిలో 624 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 37 కేసులు నమోదుకావడంతో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 92,99,245కి చేరింది.