వార్తలు (News)

పిజ్జా రెస్టారెంటు కోటి నష్టపరిహారం చెల్లించాలంటూ మహిళ డిమాండ్

మీకు ఎప్పుడైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా వేరే వస్తువు వస్తే ఏమి చేస్తారు?
యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన దీపాళీ త్యాగి మాత్రం కోటి రూపాయలు డిమాండ్ చేసింది. ఎందుకు ఆమె నష్టపరిహారం అడిగిందో తెలుసుకోవాలనుందా?? ఐతే ఆ వివరాలు చూద్దాం.

దీపాళీ త్యాగి అనే మహిళ ప్యూర్ వెజిటేరియన్. ఆ రోజు హోలీ. పిల్లలంతా ఆడుకొని ఆకలితో ఉండటంతో పిజ్జా అర్డర్‌ చేసింది. ప్యాకింగ్‌ తెరిచేసరికి అందులో నాన్‌వెజ్‌ పిజ్జా ఉంది. రెస్టారెంట్ ఔట్ లెట్ పంపినది నాన్ వెజ్ పిజ్జా అని తెలియక ఇంట్లో అందరూ తినేశారని, ఆ తర్వాతే అది నాన్ వెజ్ అని తెలిసిందని, వెంటనే కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని తెలిపింది.

వారి కుటుంబ సాంప్రదాయాల ప్రకారం నాన్ వెజ్ ఆహారం ముట్టుకోనని తన ఫిర్యాదులో పేర్కొంది. దాంతో లాయర్‌ సహాయంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. రెస్టారెంటును కోటి రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. తమ మత విశ్వాసాలను దెబ్బతినేలా రెస్టారెంట్ వ్యవహరించిందంటూ ఆ మహిళ వినియోగదారుల కోర్టుకు విన్నవించుకుంది. దీనిపై కోర్టు పిజ్జా కంపెనీని వివరణ కోరింది. తదుపరి విచారణ మార్చి 17న జరుగనుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.