చిత్తూరు జిల్లా రేణిగుంట పట్టణంలోని బస్టాండుకు దగ్గరలో ఉన్న ఒక లాడ్జిలో వేర్వేరు గదుల్లో వెంకట్ గౌడ్ (35), అనిత (31)అనే ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. వెంకట్ గౌడ్ పురుగుల మందు తాగి చనిపోగా, అనిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వీరిద్దరూ రెండు రోజుల క్రితం లాడ్జిలో వేర్వేరు గదులు తీసుకుని ఇవాళ మధ్యాహ్నం వారు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మహత్యలపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అంజూయాదవ్ తెలిపారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన వెంకట్ గౌడ్ అనే వ్యక్తి, సత్యనారాయణపురానికి చెందిన అనిత అనే ఆమె 15 ఏళ్లుగా తిరుపతిలో కూడా పండ్ల వ్యాపారం చేస్తున్నాడు. మృతులిద్దరూ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లుగా వెంకట్ గౌడ్ కుటుంబసభ్యులు తెలిపినట్లు సీఐ తెలిపారు. అయితే, వీరిద్దరూ వేర్వేరు గదుల్లో ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదని సీఐ చెప్పారు.