కరొనపై పోరాటంలో ముందుండి నడిపిస్తున్న పోలీసులు ఢిల్లీలో కరోనా బారినపడ్డారు.
సుమారు 3000 మంది సిబ్బంది పాజిటివ్‌గా నిర్దారించారని, వీరిలో 15 మందిని హాస్పిటల్‌లో చేర్పించగా మిగిలినవారు హోం క్వారంటైన్‌లో ఉన్నారని ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌ఎన్‌ శ్రీవాస్తవ తెలిపారు. నగరంలో కొవిడ్‌-19 కేసులు అకస్మాత్తుగా పెరగడంతో గడిచిన కొద్ది రోజులుగా సిబ్బంది పరీక్షలు చేయించుకోవడంతో ఈ కేసులు వచ్చినట్లు పేర్కొన్నారు.

విధులు నిర్వహిస్తున్న సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తున్నారని, అయినా కొందరు వైరస్‌ బారినపడుతున్నారని చెప్పారు. విధుల్లో ఉన్న సమయంలో తప్పనిసరిగా మూడు పొరలున్న లేదంటే.. ఎన్‌-95 మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం నిబంధనలు, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు.

నిన్న ఒకే రోజు ఢిల్లీలో 16,699 పాజిటివ్‌ కేసులు, 112 మరణాలు నమోదయ్యాయి. దేశ రాజధానిలో వరుసగా ఐదోరోజు 10వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 7.84లక్షలకు చేరగా 54,309 క్రియాశీల కేసులున్నాయి.