వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

చెన్నైకి సునాయాసంగా ఛేదించగలిగిన టార్గెట్

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసి అతి స్వల్పమైన లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది. .

దీపక్‌ చాహర్‌ (13/4) మెరుపు వేగంతో బంతులు సంధించడంతో పంజాబ్‌‌ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునగడంతో ఓపెనర్లుగా వచ్చిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌(5), మయాంక్‌ అగర్వాల్‌(0)తో పాటు క్రిస్‌గేల్‌(10), దీపక్‌ హుడా(10), నికోలస్‌ పూరన్‌(0) టాప్‌ ఆర్డర్‌ మొత్తం పూర్తిగా విఫలమై రాహుల్‌ రనౌట్‌ కాగా, మిగతా అందర్నీ చాహర్‌ పెవిలియన్‌ పంపాడు.

ఈ దశలోనే క్రీజులోకి అడుగుపెట్టిన యువ బ్యాట్స్‌మన్‌ షారుఖ్‌ ఖాన్‌(47; 36 బంతుల్లో 4×4, 2×6) ధీటుగా ఆడినా మరో ఎండ్‌లో అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ కరువవ్వడంతో రిచర్డ్‌సన్‌(15)తో కలిసి ఆరో వికెట్‌కు 31 పరుగులు, మురుగన్‌ అశ్విన్‌(6)తో కలిసి ఏడో వికెట్‌కు 30 పరుగులు జోడించి చివర్లో మహ్మద్‌ షమి(9)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 14 పరుగులు జోడించాడు. అయితే, ఆఖరి ఓవర్‌లో అర్ధశతకానికి చేరువైన వేళ భారీ షాట్‌ ఆడిన షారుఖ్‌ జడేజా చేతికి చిక్కడంతో పంజాబ్‌ 101 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ కోల్పోయి చివరికి చెన్నై ముందు 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక చెన్నై బౌలర్లలో సామ్‌కరన్‌, మోయిన్‌ అలీ, బ్రావో తలో వికెట్‌ పడగొట్టారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.