వార్తలు (News)

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం మూసివేత

ఆంధ్రప్రదేశ్‌ కడప జిల్లా ఒంటిమిట్టలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోదండరామస్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కొవిడ్‌ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయం మూసివేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో త్వరలో జరగనున్న శ్రీరామనవమి ఉత్సవాలపై సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏటా కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.