వార్తలు (News)

తెలంగాణలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 3,840 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,41,885కు చేరింది. తాజాగా 1,198 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకోవడంతో ఇప్పటి వరకు మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,09,594 కు చేరింది. ప్రస్తుతం 30,494 యాక్టివ్‌ కేసులుండగా 20,215 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న ఒక్క రోజు రాష్ట్రంలో 1,21,880 కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.