జాతీయం (National) వార్తలు (News)

కరోనాతో క్యాబ్‌ డ్రైవర్లకు గడ్డుకాలం

కరోనాతో ఉపాధి కోల్పోయిన వారిలో క్యాబ్‌ డ్రైవర్లు కూడా ఉన్నారు. ప్రతిరోజూ ఐటీ కారిడార్‌కు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 30 వేల క్యాబ్‌లు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం వాటి సంఖ్య రెండు వందలకు మించడం లేదని క్యాబ్స్‌, డ్రైవర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. గత ఏడాది లాక్‌డౌన్‌ నుంచి ప్రైవేట్‌ వాహనాలు ప్రజలు ఎక్కువగా వాడకుండా వ్యక్తిగత ప్రయాణాలకు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా ప్రబలుతుండటంతో సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయడానికి జంకుతుండగా మరికొందరు సొంత వాహనాలను వాడుతున్నారు. లేనివారు సెకండ్‌ హ్యాండ్‌ కార్లను కొనుగోలు చేసుకుంటున్నారు. మొత్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌తో వాహనాలపై ఆధారపడిన డ్రైవర్ల ఉపాధికి గండి పడింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో డ్రైవర్లు ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవలసిరావడంతో మరికొంతమంది ట్రాన్స్‌పోర్ట్‌ వృత్తినే వదిలేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.