వార్తలు (News)

నర్సాపురంలో కలవరపెడుతున్న గ్యాస్‌ లీకేజీ

పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారామపురం వద్ద ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైప్‌లైన్‌ లీకేజీ కావడం స్థానికంగా కలకలం రేపింది. పైప్‌లైన్‌ నుంచి గ్యాస్‌ స్వల్పంగా లీకవడంతో మంటలు ఎగసిపడుతున్నాయి. అది చూసిన పరిసర ప్రాంత రైతులు భయాందోళనకు గురయ్యారు. సమాచారమందుకున్న ఓఎన్‌జీసీ, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా మంటలు అదుపులోకి రాలేదు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.