యెడియూరప్పకు స్వల్పంగా జ్వరం ఉండడంతో టెస్టు చేయించుకోగా పరీక్షలో కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయిందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం బాగానే ఉన్నానని, వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరానని, మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నానని ఆయన చెప్పారు. 78 ఏళ్ల యెడియూరప్ప ఇటీవల రెండో వాక్సిన్ కూడా వేయించుకోగా కరోనా రెండోసారి సోకింది. కొద్దిరోజులుగా తనను కలిసినవారంతా సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని ఆయన కోరారు.