జాతీయం (National) వార్తలు (News)

తటస్థంగా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు..

నేడు దేశీయ మార్కెట్లు ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే నష్టాల్లోకి జారుకుని వెంటనే తిరిగి పుంజుకొని ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. 48,935 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించిన సెన్సెక్స్ కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో 49,089 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకి 28 పాయింట్ల స్వల్ప లాభంతో 48,832 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 14,599 వద్ద ప్రారంభమై 14,559 – 14,697 మధ్య కదలాడి 36 పాయింట్లు ఎగబాకి 14,617 వద్ద స్థిరపడింది. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సిప్లా, హిందాల్కో ఇండస్ట్రీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే ఇండియా, సన్‌ ఫార్మా షేర్లు లాభాల్లో పయనిస్తే ఎస్‌బీఐ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌,షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంకింగ్‌, స్థిరాస్తి, ఇంధన రంగ షేర్లు నష్టపోవడం మార్కెట్ల మీద ప్రభావం చూపించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.