టెక్నాలజీ (Technology) వార్తలు (News)

బజాజ్‌ సీటీ 110ఎక్స్ బుకింగ్‌ల నిలిపివేత

కొవిడ్‌ కేసుల విజృంభణ కారణంగా సరఫరా వ్యవస్థ అనిశ్చితి నేపథ్యంలో విద్యుత్‌ స్కూటర్‌ చేతక్‌ బుకింగ్‌లను పునఃప్రారంభించిన 48 గంటల్లోపే మళ్లీ నిలిపివేస్తున్నట్లు బజాజ్‌ ఆటో తెలిపింది. గుడిపడ్వా పర్వదినం సందర్భంగా మంగళవారం కంపెనీ చేతక్‌ ఆన్‌లైన్‌ బుకింగ్‌లను బెంగళూరు, పుణెలలో ప్రారంభించగా ముందస్తు బుకింగ్‌లకు మంచి స్పందన వచ్చిందని, సరఫరా పరిస్థితులపై సమీక్ష చేసిన తర్వాత తదుపరి బుకింగ్‌ అవకాశాలను ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.

దీని ధర రూ.55,494 (ఎక్స్‌-షోరూమ్‌ ముంబయి). సీటీ పోర్ట్‌ఫోలియోలో అత్యున్నత వేరియంట్‌ అయిన సీటీ 110ఎక్స్‌ మోటార్‌సైకిల్‌లో 115సీసీ డీటీఎస్‌-ఐ ఇంజిన్‌ అమర్చిన ఈ బైక్‌ వెనుక క్యారియర్‌ 7 కేజీల వరకు బరువు మోయగలదు. సెమీ నాబీ టైర్లు, స్క్వేర్‌ ట్యూబ్‌ వంటివి ఉన్నాయని బజాజ్‌ ఆటో అధ్యక్షుడు (మోటార్‌సైకిళ్లు) సారంగ్‌ కనాడే పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.