ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో అన్ని జిల్లాల్లో ఈ ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్ అమ‌లులో ఉంటుంద‌ని ప్ర‌భుత్వ అధికారులు వెల్ల‌డించారు. ఇక మాస్క్ లేకుండా తిరిగేవారు మొదటిసారి పట్టుబడితే వెయ్యి రూపాయ‌లు, రెండ‌వ‌సారి మాస్క్ లేకుండా ప‌ట్టుబ‌డ్డ వారికి ప‌ది వేల జ‌రిమానా విధించ‌నున్నారు. యూపీ సీఎం ఆదిత్య‌నాథ్‌తో పాటు ఆ రాష్ట్ర మాజీ సీఎం అఖిలేశ్ యాద‌వ్‌ రెండు రోజుల క్రితం క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలింది.