అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

నీరవ్ మోదీని అప్పగించబోతున్న యూకే ప్రభుత్వం

భారత ప్రభుత్వం భారత్‌ బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయినవారిని వెనక్కి రప్పించడానికి చేసే ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలిస్తున్నట్టే ఉన్నాయి. తాజాగా నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు యూకే హోంశాఖ అంగీకరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన నీరవ్ మోదీని భారత్‌కు తీసుకొచ్చేందుకు కొన్నేళ్లుగా యూకేలోని న్యాయ స్థానాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గత ఫిబ్రవరి 25న నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించేందుకు యూకే కోర్టు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో నీరవ్ మోదీని ముంబై తీసుకొచ్చిన వెంటనే అర్థర్ రోడ్ జైలులోని 12 నంబర్ బ్యారక్‌లో ఉంచుతామని జైలు అధికారి తెలిపారు. ఈ బ్యారక్‌కు సెక్యూరిటీ అత్యంత పటిష్టంగా ఉంటుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.