అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

7,000 మంది ఖైదీలను వదిలితేనే కాల్పుల విరమణ: తాలిబన్‌లు??

అఫ్గానిస్తాన్ ప్రభుత్వం తమ ఖైదీలు 7,000 మందిని విడుదల చేస్తే మూడు నెలల పాటు కాల్పుల విరమణ పాటిస్తామని తాలిబన్లు ప్రతిపాదన చేశారని “ఇది చాలా పెద్ద డిమాండ్” అని అఫ్గాన్ ప్రభుత్వం మధ్యవర్తి నాదర్ నాదరీ అన్నారు.

దీనిపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించిన తరువాత ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చి దేశంలోని 85 శాతం భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఇది ఎంతవరకు వాస్తవమన్నది స్వతంత్రంగా నిర్ధరించడం సాధ్యం కాదు. ప్రభుత్వం ఆ మాటను తోసిపుచ్చుతోంది.

మొత్తం 400 జిల్లాల్లో మూడో వంతు మీద తాలిబన్లు పట్టు సాధించారని అంచనా! తమ ఖైదీలను విడుదల చేయడమే కాకుండా ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్ట్ నుంచి వారి పేర్లు తొలగించాలని కూడా తాలిబన్ల డిమాండ్.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •