క్రైమ్ (Crime) వార్తలు (News)

భార్యపై కూడా గృహ హింస కేసు పెట్టవచ్చు: ఢిల్లీ హైకోర్టు!!

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా గృహ హింస కేసులు పెరుగుతుండడంతో గత కొద్దికాలంలోనే గృహ హింస చట్టం కింద కేసులు భారీగా నమోదయ్యాయి. అయితే ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు ముందుకు ఓ పిటిషన్ రావడంతో దానిపై విచారించిన న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇకమీదట మహిళలపై కూడా గృహ హింస కేసులు పెట్టవచ్చని స్పష్టం చేసింది. ‘భార్యలను భర్తలు వేధించడమే కాదు.. భార్యలూ భర్తలను వేధిస్తున్నారు’ అనే పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేస్తూ ఇకనుంచి భర్తను హింసించే భార్యపై కూడా కేసు పెట్టవచ్చని సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. భర్తలు కూడా న్యాయం కోసం పోరాడవచ్చని స్పష్టం చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •