టెక్నాలజీ (Technology) వార్తలు (News)

మళ్లీ జేఈఈ (మెయిన్‌) పరీక్షల షెడ్యూల్‌ మార్పు!!

జేఈఈ (మెయిన్‌) పరీక్షలను ఆగస్టు 26, 27, 31; సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో నిర్వహిస్తామని, జేఈఈ మెయిన్‌ నాలుగో సెషన్‌ దరఖాస్తుల గడువును కూడా ఈ నెల 20 వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ఈ పరీక్షకు ఇప్పటికే 7.32 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నారని, విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పులు చేసినట్టు.. మూడు, నాలుగు విడతల జేఈఈ మెయిన్‌ పరీక్షల మధ్య నాలుగు వారాల వ్యవధి ఇవ్వాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) డీజీకి సూచించినట్టు మంత్రి తెలిపారు. మూడో విడత పరీక్షల్లో ఎన్‌టీఏ స్వల్ప మార్పులు చేసినట్టు ప్రకటించగా మే నెలలో జరగాల్సిన నాలుగో దశ పరీక్షలను ఆగస్టు నెలాఖరు నుంచి నిర్వహించాలని తాజాగా నిర్ణయించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •