టెక్నాలజీ (Technology) వార్తలు (News)

పోస్ట్ ఆఫీసులో పదవ తరగతి అర్హతతో ఉద్యోగాలు??

పదవ తరగతి అర్హతతో పోస్ట్ ఆఫీస్ Post Office లో స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. మొత్తం 16 ఖాళీలు ఉన్నాయి. . 10వ తరగతి పాస్ అయినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. అలానే అభ్యర్థులకు మూడేళ్ల లైట్, హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉండాలి.

ముంబైలోని భారత ప్రభుత్వ కమ్యూనికేషన్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ విభాగం మెయిల్ మోటార్ సర్వీసులో ఈ ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి మోటార్ మెకానిజం కూడా తెలిసి ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్ల లోపు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు లేదు.

ఈ పోస్టులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనుండగా స్పీడ్ పోస్టు ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆగస్టు 9, 2021 లోపు పంపించాలని ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఆసక్తి, అర్హత వున్నవాళ్లు అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా స్పీడ్‌పోస్ట్‌లో మాత్రమే పంపాలి.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.indiapost.gov.in/వెబ్‌సైట్‌లో Recruitment అనే సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.

అభ్యర్థులు ఇండియా పోస్ట్ వెబ్‌సైట్‌లో అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసి దరఖాస్తుల్ని పంపాల్సిన చిరునామా: The Senior Manager, Mail Motor Service, 134a, Ahike Marg, Varli, Mumbai.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •