జాతీయం (National) వార్తలు (News)

జస్డ్‌ డయల్‌ .. C/O ముఖేష్ !!

స్థానిక వ్యాపార సంస్థల ఫోన్‌ నెంబర్లు, ఇతర వివరాలు తెలిపే జస్డ్‌ డయల్‌ (88888 88888)ను సొంతం చేసుకునే దిశగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) చర్చలు జరుపుతోంది. వ్యవస్థాపక ప్రమోటర్ల నుంచి 800-900 మిలియన్‌ డాలర్ల (రూ.6,000-6,750 కోట్లు) మొత్తానికి కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం! ఇది కార్యరూపం దాల్చినట్టయితే జస్ట్‌ డయల్‌ వద్ద ఉన్న వ్యాపారుల వివరాలన్నీ రిలయన్స్‌కు చేరతాయి.

జస్ట్‌ డయల్‌ ఎండీ వి.ఎస్‌.ఎస్‌. మణి, ఆయన కుటుంబానికి కంపెనీలో 35.5 శాతం వాటా ఉండగా దాని విలువ రూ.2387.9 కోట్లుగా ఉంది. ముందుగా వీరి వాటా కొనుగోలు చేసిన తర్వాత ఓపెన్‌ ఆఫర్‌ ద్వారా మరో 26 శాతం వాటా స్వాధీనం చేసుకోవాలన్నది రిలయన్స్‌ ప్రణాళిక. ఓపెన్‌ ఆఫర్‌కు పూర్తి స్థాయి స్పందన లభిస్తే రిలయన్స్‌కు జస్ట్‌డయల్‌లో 60 శాతం వాటా, తదుపరి కంపెనీలో జూనియర్‌ భాగస్వామిగా మణి ఉంటారని సమాచారం. గతంలో టాటా సన్స్‌ సైతం ఈ కంపెనీతో చర్చలు జరిపినప్పటికీ అవి ఫలవంతం కాకపోవడం గమనార్హం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •