వార్తలు (News)

అల్పపీడన ప్రభావం మరో రెండు రోజులు??

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం ఇప్పటికే వెల్లడించగా ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ, హైదరాబాద్‌ కు తూర్పు దిశలో అల్పపీడన ప్రాంతం ఏర్పడి క్రమంగా తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతం మీదుగా అరేబియా సముద్రం వైపు కదులుతోంది. దీంతో గాలుల తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టి దీని ప్రభావంతో రాయలసీమలో విస్తారంగా, కోస్తాంధ్రలో అడపాదడపాగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపో ఆవరణం వరకు విస్తరించి కొనసాగుతోంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •