క్రైమ్ (Crime) వార్తలు (News)

రూ. 2 వేల నోట్లు రద్దు చేస్తున్నారంటూ 45 లక్షలకు టోకరా??

చిత్తూరులో రెండు వేల రూపాయల నోట్లు రద్దవుతాయని చెబుతూ రూ. 45 లక్షలకు టోకరా వేసిన ఘటన జరిగింది. ఇదిగో బాబూ.. నా వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ ఉంది. అన్నీ 2 వేల నోట్లే. త్వరలో కేంద్ర ప్రభుత్వం వీటిని రద్దు చేస్తానంటోంది. నీకు తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే చెప్పు, వాళ్లు 500 రూపాయల నోట్లతో 90 లక్షలు ఇస్తే, కోటి రూపాయల 2 వేల నోట్లు ఇస్తా. నీకు 2 శాతం కమీషన్ అదనంగా ఇస్తా’ అని డీల్ కుదుర్చుకుని రూ. 45 లక్షలు దోచుకెళ్ళగా చిత్తూరు పోలీసులు తమిళనాడుకు చెందిన కొందరిని అరెస్ట్ చేశారు. ఆ నిందితుల నుంచి పోలీసులు రూ. 32 లక్షల నగదు, రెండు తుపాకులు, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •