జాతీయం (National) వార్తలు (News)

నష్టాల్లో ముగిసిన నేటి మార్కెట్లు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ లు నేడు ఉదయం స్వల్ప లాభాలబాట పట్టినప్పటికీ ఆద్యంతం ఊగిసలాటల మధ్య ఫ్లాట్‌గా ముగిశాయి.ప్రస్తుతం సూచీలు గరిష్ఠాల వద్ద ట్రేడవుతుండడంతో మదుపర్లు స్థిరీకరణ కోసం వేచిచూస్తున్నారు దీంతో ఎటు తేలని స్థితిలో మార్కెట్లు ఉండిపోయాయి. చివరికి సెన్సెన్స్‌ 18 పాయింట్ల నష్టంతో 53,140 వద్ద ముగియగా నిఫ్టీ 0.80 పాయింట్లు నష్టపోయి 15,923 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈ 30 సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌, ఐటీసీ, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, ఎల్‌అండ్‌టీ, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ముగియగా.. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •