వార్తలు (News)

జలమయమైన ముంబై మహా నగరం!!

ముంబయి లో శుక్రవారం తెల్లవారుజామున నుంచి కురిసిన వర్షం కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రైల్వే ట్రాక్‌లపై నీరు చేరడంతో లోకల్‌ రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది.

ఉదయం దాదాపు మూడు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవగా జుహూలో 136 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నగర శివారుల్లో అయితే 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. తూర్పు ముంబయిలోని చాలా ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపైకి నీరు చేరడంతో కొన్ని లోకల్‌ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండగా, రైళ్ల రాకపోకలు నిలిచిపోగా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రానున్న 24 గంటల్లో ముంబయి, ఠాణె, ఇతర మహారాష్ట్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అంచనా వేసి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •