అంతర్జాతీయం (International) వార్తలు (News)

ఉయ్యాల నుండి జారి అమాంతం లోయలో పడ్డ యువతులు!!

ఉయ్యాల చూస్తే ఏ వయసు వారికీ అయినా అందులో ఊగాలనిపించటం సర్వ సాధారణం! అలాగే చిన్నతనంలో తీపి గుర్తులు నెమరువేసుకోవాలని ప్రయత్నించిన ఇద్దరు యువతులకు చేదు అనుభవం ఎదురయింది.

రష్యాలోని డగేస్టన్ లోని కాన్యాన్ పర్యాటక ప్రాంతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. పర్యాటకుల ఆటవిడుపుకోసం ఓ ఎత్తైన కొండ శిఖరం అంచున టూరిజం అధికారులు ఉయ్యాలను ఏర్పాటు చేశారు. నిత్యం చాలా మంది ఇక్కడి వచ్చి సరదాగా ఉయ్యాల ఊగుతూ అనుభూతి చెంది వెళుతూ ఉంటారు.

ఈక్రమంలోనే టూరిజం స్పాట్ కు వచ్చిన ఇద్దరు యువతులు ఉయ్యాల ఊగేందుకు ప్రయత్నించారు. ఉయ్యాల ఊగుతున్న క్రమంలో కొండపై నుండి దిగువనున్న లోతును చూసి ఒక్కసారిగా భయాందోళనకు లోనయ్యారు. ఉయ్యాల ఊగుతూనే దానిపై నుండి ఒక్కసారిగా దూకేశారు. కొండపై నుండి నేరుగా 6000 అడుగుల లోయలో పడ్డారు. కొండ అంచున టూరిజం అధికారులు ఏర్పాటు చేసిన డెక్కింగ్ ప్లాట్ ఫాంపై పడటంతో ఆ ఇద్దరు యువతులు స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.

ఉయ్యాల వేగం ఇంకా ఎక్కవగా ఉంటే ఈ పాటికి ఆ యువతులు ఇద్దరు ప్రాణాలు కొల్పోయి ఉండేవారని టూరిజం అధికారులు తెలిపారు. ఉయ్యాలకు ఉన్న ఒకవైపు తాడు తెగిపోవటం వల్లే ఇది జరిగినట్లు దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •