క్రైమ్ (Crime) వార్తలు (News)

హైదరాబాద్‌లో పన్ను కట్టకుండా తిరుగుతున్న 11 హై ఎండ్‌ లగ్జరీకార్లు సీజ్‌!!

రవాణ శాఖ అధికారులు ఆదివారం పన్ను ఎగవేసి తిరుగుతున్న హై ఎండ్‌ లగ్జరీ కార్లపై కొరడా ఝుళిపిస్తూ ఆకస్మిక దాడులు చేసి 11 వాహనాలను సీజ్‌ చేశారు. డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ కె.పాపారావు నేతృత్వంలో మోటారు వాహన తనిఖీ అధికారులు, సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రర్‌ అయిన కొన్ని లగ్జరీ కార్లు రవాణా శాఖకు జీవితకాల పన్ను చెల్లించకుండా హైదరాబాద్‌లో తిరుగుతున్నట్లు గుర్తించడంతో ఆర్నెల్లుగా ఇలాంటి వాహనాలపై పక్కా నిఘా పెట్టి పథకం ప్రకారం దాడులు నిర్వహించి 11 కార్లను సీజ్‌ చేశారు.

జఫ్తు చేసిన వాహనాల నుంచి జీవితకాల పన్ను రూపంలో రూ.5 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. పైగా సీజ్‌ చేసిన వాటిలో మెర్సెడస్‌ బెంజ్, మాసరట్టి, పెర్రారి, రోల్స్‌ రాయిస్, బీఎండబ్ల్యూ, లాంబోర్గీని తదితర ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ తరహా హై ఎండ్‌ వాహనాలపై దాడులు జరపడం ఆర్టీఏ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •