క్రైమ్ (Crime) వార్తలు (News)

బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు అరెస్ట్‌: డీజీపీ!

బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడిని అరెస్టు చేసినట్టు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించినట్టు, ఈకేసు దర్యాప్తులో స్థానికులు అత్యంత కీలక సమాచారాన్ని పోలీసులకు అందించారని డీజీపీ తెలిపారు. హత్యకు పాల్పడిన నిందితుడిని గుంటూరు అర్బన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.

బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో నిందితుడిని నరసరావుపేటలోని పమిడిపాడు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులను గమనించిన బ్లేడుతో చేతులు కోసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.

అసలేం జరిగిందంటే..
స్వాతంత్య్ర దినోత్సవం నాడు గుంటూరులోని సెయింట్ మేరీస్ కాలేజిలో బీటెక్ 3వ ఏడాది చదువుతున్న రమ్య అనే విద్యార్థినిని ఒక యువకుడు కత్తితో దాడి చేసి హతమార్చాడు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన యువకుడి సెల్ ఫోన్ కీలక ఆధారంగా మారింది. మృతురాలు రమ్య సోదరి మౌనిక కూడా హత్య జరిగినప్పుడు ఘటనా స్థలంలోనే ఉంది. 2 నిముషాలు రమ్యతో మాట్లాడిన యువకుడు ఆ తరువాత దాడికి పాల్పడినట్లుగా ఆమె వెల్లడించింది. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందిస్తూ ఇదొక దురదృష్టకర ఘటన అన్నారు. రమ్య మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం సుచరిత బాధిత కుటుంబంతో సంభాషించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •