అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

జర్మనీలో నరమాంస భక్షకుడు.. యావజ్జీవ కారాగార శిక్ష!!

జర్మనీలో 41 ఏళ్ళ టీచర్ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి నర మాంస భక్షకుడిగా మారాడు. ఇతడి రాక్షస కాండ విన్న పోలీసులకు, చివరకు కోర్టు న్యాయమూర్తులకు సైతం ఈ వ్యక్తి ఎందుకిలా మారాడో అంతు చిక్కలేదు.

అర్మిన్ మెవిస్ అనే ఈ టీచర్ ఆన్ లైన్ డేటింగ్ సర్వీసు ద్వారా 43 ఏళ్ళ స్టెఫాన్ టీ అనే మెకానిక్ తో పరిచయం పెంచుకుని గత సెప్టెంబరులో బెర్లిన్ లోని తన ఇంటికి పిలిపించుకున్నాడని, హతమార్చి అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి తిన్నాడని, ఈ ముక్కల్లో కొన్నింటిని నగరంలో అక్కడక్కడా పారేశాడని, ఆచూకీ తెలియకుండా పోయిన మెకానిక్ స్టెఫాన్ కోసం పోలీసులు గాలిస్తూ చివరకు నగర శివార్లలోని అటవీ ప్రాంతానికి వెళ్లగా అక్కడ వారికి కొన్ని ఎముకలు లభించాయి.

స్నిఫర్ డాగ్స్ ని రంగంలోకి దించగా అవి నిందితుడిని పట్టించాయి. ఇతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచడంతో కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది. 2006 లో కూడా అర్విన్ మెవిస్ ఆన్ లైన్ ద్వారా తనకు పరిచయమైన వ్యక్తిని హతమార్చి ఇలా చేసినందుకు కోర్టు అతడిని దోషిగా ప్రకటించింది. అయితే ఆ కేసు నుంచి ఎలా బయట పడ్డాడో గానీ అప్పటి నుంచి నరమాంస భక్షకుడిగా మారాడు. ఇతగాడు ఇంకెంతమందిని చంపి తిన్నాడోనని పోలీసులు ఆరా తీస్తున్నారు. జర్మనీలో ఇలాంటి వ్యక్తుల ఉదంతాలు తెలిసి ప్రజలు వణికిపోతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •