టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

తక్కువ ధరకే లభించనున్న వాషింగ్ మెషిన్లు !!

ఇంటి పని, బయట పనితో సామాన్య, మధ్య తరగతి మహిళల ఇబ్బందులను వర్ణించలేము. వీరికి బట్టల ఉతకడం అనేది అతి పెద్ద పని. అదే ఇంట్లో ఎక్కువ మంది సభ్యులు ఉంటె ఇక ఆ మహిళల సంగతి అయిపోయినట్టే! కొద్దిగా డబ్బున్న వారు వాషింగ్ మెషిన్లు కొని వారి సమస్యను కొంతవరకు పరిష్కరించుకుంటారు. సామాన్య, మధ్య తరగతి వారిలో ఎక్కువమంది వాషింగ్ మెషిన్లు కొనలేని పరిస్థితిలో ఉన్నారు. వీరి సమస్యను పరిష్కరించేందుకు..తక్కువ ధరలో ఉన్న వాషింగ్ మెషీన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఓ ఇంజినీర్ ప్రయత్నిస్తున్నారు.

నవజ్యోత్ సాహ్నీ..లండన్ లో జన్మించిన భారతీయ విద్యార్థి. మూడేళ్ల క్రితం తక్కువ ఆదాయ వర్గాలకు వాషింగ్ మెషిన్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఓ ప్రాజెక్టును చేపట్టారు. దీనిని స్వచ్చంద సేవకులు, భాగస్వాములతో కలిసి ఇరాక్ లోని రెప్యూజీ క్యాంప్ లో ఏర్పాటు చేయనున్నారు. సంస్థ వ్యవస్థాపకుడు నవ్ జ్యోత్ ఒకరోజు తన స్నేహితురాలు దివ్యను కలవడానికి తనింటికి వెళ్లాడు. అక్కడ తను ఇంటి పనులు చేస్తుంటే చలించిపోయాడు. ఆమె బట్టలు ఉతుకుతున్న తీరును చూసి..ఇంట్లో పనిభారం ఎక్కువగా ఉన్న వారికి ఏదైనా చేయాలని అనుకుని తక్కువ ధర ఉన్న వాషింగ్ మెషిన్ ను అందించాలని ఐడియాతో ప్రయాణం మొదలు పెట్టారు.

ఆఫ్ లోడ్, మాన్యువల్ వాషింగ్ మెషిన్ ప్రాజెక్టు ద్వారా 60-70 శాతం సమయం ఆదా చేసుకొనే వీలుంటుంది. 50 శాతం నీటిని కూడా సేవ్ చేసేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేశారు. వంటగదిలో సాధారణంగా ఉపయోగించే స్పిన్నర్ ను స్పూర్తిగా తీసుకున్నాడు. తన స్నేహితురాలు పేరు మీదనే దివ్య 1.5 మోడల్ తో మొదటి దానిని రూపొందించారు. ఇరాక్ లోని మమ్రాషన్ శరణార్థుల శిబిరంలో స్వచ్చంద సంస్థ కేర్ ఇంటర్నేషనల్ సహాయంతో 30 వాషింగ్ మెషిన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్రాల పంపిణీకి నవజ్యోత్ సెప్టెంబర్ లో ఇరాక్ వెళ్లాలని యోచిస్తున్నారు. ఏడాది అనంతరం వీటిని జోర్దాన్ క్యాంప్ లో ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వతే ఇండియా, ఆఫ్రికా దేశాల్లోనూ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •