వార్తలు (News)

జాతీయస్థాయి చిత్రలేఖనం అవార్డు పొందిన ఉపాధ్యాయుడి మరణం!!

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం అవిడి గ్రామానికి చెందిన మాగాపు శ్రీనుబాబు(40) మండలంలోని చప్పిడివారిపాలెంలో జడ్పీ ఉన్నతపాఠశాలలో ఒప్పంద చిత్రలేఖనం ఉపాధ్యాయుడిగా 2012 నుంచి పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పి.గన్నవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో శ్రీనుబాబు వారం రోజులుగా విధుల్లో నిమగ్నమై శనివారం రాత్రి చివరగా ఇక్కడ ఒక తరగతిగదిలో భారతదేశ చిత్ర పటం వేసి తనకు ఒంట్లో బాగాలేదని,రేపు వస్తానో రానో చెప్పలేనని సహచర ఉపాధ్యాయులు ఎ.శారదాకృష్ణ, వెన్నపు విజయగౌరికి తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీనుబాబు గుండెపోటుతో మరణించాడు. గతంలో జాతీయస్థాయి చిత్రలేఖనంలో అవార్డును గెలుచుకున్న ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    86
    Shares
  • 86
  •  
  •  
  •  
  •