ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

యాంటీ-వైరల్ ఫుడ్‌ని రోజూ తినండి..??

బలమైన రోగనిరోధక వ్యవస్థ అన్ని రకాల వైరల్, ఫంగల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. ఆలా రక్షించాలంటే ఆహారంలో కొన్ని యాంటీ-వైరల్ ఫుడ్‌ను చేర్చడం చాలా ముఖ్యం. యాంటీ వైరల్ ఫుడ్.. మీలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మరి రోజూ మనం తినే ఫుడలో ఏ రకమైన యాంటీ వైరల్ ఆహార పదార్థాలను తీసుకోవాలో చూద్దామా??

పసుపు..
భారతీయ కూరల్లో సాధారణంగా ఉపయోగించే పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ముఖ్యమైనది కర్కుమిన్. పసుపులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇది కొన్ని రకాల వైరస్‌లను తొలగించడానికి, వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో సహాయపడుతుంది.

సోంపు..
సోంపు గింజల్లో ట్రాన్స్-అనెథోల్ ఉంటాయి. ఇవి అనేక రకాల వైరస్‌కు వ్యతిరేకంగా చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గించడానికి ఉపకరిస్తుంది. దీనిని వైరల్ ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడటానికి సహాయపడే లిక్కర్-ఫ్లేవర్డ్ ప్లాంట్ అని కూడా అంటారు. సోంపు గింజల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఆహారంలో దీనికి చేర్చడం వల్ల సైనసెస్, శ్వాసకోశ వ్యవస్థను క్లియర్ చేయవచ్చు.

తులసి..
ప్రతీ హిందువుల ఇంట్లో తులసి సాధారణంగా కనిపిస్తుంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల తులిసి చెట్లు ఉన్నాయి. వీటిన్నంటిలోనూ యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. రోజూ కొన్ని తులసి ఆకులను నమలడం వలన అనేక ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి మీ శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది. తులసి పదార్ధాలలో ఎపిజెనిన్, ఉర్సోలిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉన్నాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

వెల్లుల్లి..
వెల్లుల్లిని అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. ఇది అనేక రకాల వైరస్‌లు, ఫ్లూకి వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. అల్లిసిన్ అనే మూలకం ఈ వెల్లుల్లిలో ఉండటం మూలంగా.. ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వెల్లుల్లిలో క్వెర్సెటిన్, అల్లిసిన్ వంటి ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాల కేంద్రం. ఇవి యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. వైరస్ వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

అల్లం..
అల్లం అనేక రకాల ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేసే సూపర్ ఫుడ్. ఇందులో ప్రభావవంతమైన యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. వైరల్, ఫ్లూ వ్యాదుల నివారణకు ప్రభావంతంగా పని చేస్తుంది. ఇది కాకుండా, అల్లంలో జింజరోల్, జింగరోన్ వంటి లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి శరీరంలో వైరస్ పెరుగుదలను నిరోధిస్తాయి. అల్లం టీ, అల్లం మాత్రలు గొంతు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అలాగే.. టెన్షన్, తలనొప్పి నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడతాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •