జాతీయం (National) వార్తలు (News)

సరికొత్త గరిష్ఠాలకు చేరిన మార్కెట్ సూచీలు!!

నేటి దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం స్తబ్దుగా మొదలైనప్పటికీ మధ్యాహ్నం తర్వాత కోలుకుని ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్‌ ఇంట్రాడేలో 55,680 వద్ద తాకగా చివరకు 145 పాయింట్ల లాభంతో 55,582 వద్ద ముగియడంతో 16,589 వద్ద నిఫ్టీ జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసి చివరికి 33 పాయింట్లు ఎగబాకి 16,563 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో బజాజ్‌ ఫినాన్స్‌, ఎంఅండ్‌ఎం, , ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, రిలయన్స్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా స్టీల్‌, హెచ్‌యూఎల్‌, సన్‌ ఫార్మా, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ముగియగా.. పవర్‌ గ్రిడ్‌, ఎస్‌బీఐ, మారుతీ, అల్ట్రాటెక్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •