అంతర్జాతీయం (International) ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

అగ్ర రాజ్యంలో మూడో టీకా ఇస్తున్నారా??

కరోనా మూడోదశ ముప్పు అధికంగా పొంచి ఉండడంతో అమెరికా తన దేశంలోని పౌరులకు మూడో డోసు టీకా ఇవ్వాలని నిశ్చయించింది. అక్కడ అకస్మాత్తుగా కేసులు పెరిగిపోతుండడంతో ఏమి చేయాలో తెలియక అల్లాడిపోతున్న అమెరికా మూడో డోసు టీకాతో కుదుట పడే అవకాశం ఉంటుందని భావిస్తుంది. రెండు డోసుల టీకా తీసుకున్నవారు కొందరు బలహీనంగా ఉండటం, అవయక మార్పిడి జరిగినవారు మూడో టీకా తీసుకోనున్నారు. దీనికి వైద్యుల ప్రిస్క్రిప్షన్ అవసరం లేకుండానే ఇవ్వనున్నారు. తమ ప్రజలందరికీ మూడో డోసు టీకా బూస్టర్ డోసుగా పనిచేస్తుందని ఆ దేశం భావిస్తోంది. అక్కడ ప్రస్తుతం ఫైజర్‌, మోడెర్నా టీకాలిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    9
    Shares
  • 9
  •  
  •  
  •  
  •