జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఆయిల్‌ ఇండియాలో జాబ్స్‌ నోటిఫికేషన్!!

ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌లో పలు కాంట్రాక్ట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో మొత్తం 115 ఖాళీలు ఉండగా వెల్డర్, ఫిట్టర్, డీజిల్‌ మెకానిక్‌ వంటి పోస్టులున్నాయి. ఈ ఖాళీలను అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో ఉన్న యూనిట్లలో భర్తీ చేస్తోంది.

ఈ ఉద్యోగాలు కేవలం కాంట్రాక్టు ప్రతిపాదన ద్వారా చేపట్టనున్నాయి. వీటిని వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ చేపట్టనుంది. 2021 ఆగస్ట్‌ 16 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు నిర్వహించనుంది.
ఈ నోటిఫికేషన్‌ కు సంబంధించిన పూర్తి వివరాలను ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ అధికారిక వెబ్‌సైట్‌ https://www.oil&india.com/లో తెలుసుకోవచ్చు. ఇందులో మొత్తం 115 ఖాళీలు ఉండగా అందులో అసిస్టెంట్‌ వెల్డర్‌- 1, అసిస్టెంట్‌ ఫిట్టర్‌- 2, అసిస్టెంట్‌ డీజిల్‌ మెకానిక్‌- 5, ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌- 5, గ్యాస్‌ లాగర్‌- 8, అసిస్టెంట్‌ రిగ్‌ ఎలక్ట్రీషియన్‌- 10, కెమికల్‌ అసిస్టెంట్‌- 10, అసిస్టెంట్‌ మెకానిక్‌- 31, అసిస్టెంట్‌ మెకానిక్‌- 31, అసిస్టెంట్‌ మెకానిక్‌ పంప్‌-17, డ్రిల్లింగ్‌ రిగ్‌మ్యాన్‌- 26 పోస్టులున్నాయి. వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీలు కూడా పోస్టును బట్టి మారుతాయి.

పది, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్‌ కావాలి. పోస్టును బట్టి వేర్వేరుగా వయస్సు వివరాలు ఉన్నాయి. 18-40 ఏళ్ల లోపు ఉన్నవారు దరఖాస్తు చేయొచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    223
    Shares
  • 223
  •  
  •  
  •  
  •