జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఢిల్లీలో రోడ్డుపై పాఠాలు .. కదులుతున్న పాఠశాల!!

కరోనా విజృంభణతో పెద్దలు, యుక్త వయస్సు వారు అందరూ రెండేళ్లుగా ఇంటి పట్టునే ఉంటున్నారు. ప్రక్రియలో భాగంగా విద్యార్థుల చదువులుకూడా సాగడం లేదు. విద్యా సంవత్సరం నష్ట పోకూడదని ప్రభుత్వం ఏదో పాస్ చేస్తుందే కానీ, నిజంగా విద్యార్థులు పై తరగతులకు వెళ్లేందుకు అంతటి నైపుణ్యం ఉందా? విజ్ఞానం సంపాదించారా? అంటే అది అనుమానమే! విద్యార్థులకు ప్రభుత్వం ఆన్​లైన్​లో మాత్రం క్లాసులు చెప్పిస్తోంది. కానీ ఆన్లైన్​ చదువులంటే పిల్లలకు ఖరీదైన ఫోన్లు, ట్యాబ్​లు, ల్యాప్​టాప్​లు ఏదో ఒకటి తప్పనిసరిగా ఉండాలి.

పేద మధ్య తరగతి వారు అవేమి కొనలేని పరిస్థితిలో ఉంటారు. మరి వారి పిల్లలు ఎలా చదువుకోవాలి? అందుకే ఓ స్వచ్ఛంద సంస్థ అలాంటి పిల్లల కోసం రంగంలోకి దిగి టీచర్ తో ​ పాఠాలు చెప్పిస్తుంది అది ఏదో స్కూల్​లోనూ, ఏదో గదిలోనో అనుకుంటే పొరబాటే. ఆ సంస్థ ఓ బస్సునే స్కూల్​గా మార్చేసింది. ఆ పాఠశాల ఇప్పడు రోడ్డుపై పరుగెత్తుతోంది. పిల్లలకు విద్యా బుద్దులు నేర్పిస్తోంది. అంతేనా చదువుకోవడానికి వచ్చిన పిల్లలకు మధ్యాహ్న భోజనం సైతం పెడుతోంది. ఇంతకీ బస్సులో పాఠాలెలా? ఎవరు చెబుతున్నారో తెలుసుకోవాలనుందా??

ఢిల్లీలోని ‘హోప్’ అనే కమ్యూనిటీ స్కూల్, మొబైల్ తరగతి గదుల ద్వారా వెనుకబడిన పిల్లలు చదువు నేర్చుకోవడంలో సహాయ పడుతూనే ఉచిత విద్య, మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పిస్తోంది. తేజస్ ఆసియా’ అనే ఎన్‌జీవో ఏడేళ్ల కిందట కమ్యూనిటీ స్కూల్‌ని ప్రారంభించింది. ఈ మేరకు బడులు లేని ప్రాంతాల్లో చిన్నారులకు పాఠాలు చెప్పేందుకు ‘హోప్ బస్సు’లను తయారుచేయగా ప్రస్తుతం నాలుగు బస్సులు ఢిల్లీలోని ఎనిమిది ప్రదేశాలకు వెళుతున్నాయి. అక్కడ పిల్లలకు రెండు గంటలపాటు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులు మరో చోటికి వెళుతారు. విద్యార్థులకు పుస్తకాలు ,ఆహారం, స్లేట్‌లు, కలరింగ్ పెన్నులు కూడా అందిస్తున్నారు.

హోప్ బస్సుల ద్వారా ప్రత్యేకంగా ఒక అండర్‌ సర్వడ్ కమ్యూనిటీలోని ప్రదేశాలకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే వారు బడికి వెళ్లే అవకాశం లేకపోవడంతో పాఠశాలనే విద్యార్థుల వద్దకు తీసుకెళ్లాలనుకుంటున్నాం. హోప్ బస్సులు వారి జీవితాల్లో నిజమైన హోప్‌ను కలిగిస్తున్నాయని నమ్ముతున్నాను అని నిర్వాహకులు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •