అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

కాబుల్ ఎయిర్‌పోర్టులో కాల్పులు జరిపిన భద్రతా సిబ్బంది.. ఐదుగురి మృతి??

అఫ్గానిస్థాన్‌ తాలిబన్ల వశమవడంతో ప్రజల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయి వేలాది మంది పౌరులు అఫ్గాన్‌ను వీడి వెళ్లేందుకు కాబుల్‌ విమానాశ్రయానికి పరుగులు పెట్టారు. అక్కడ విపరీతమైన రద్దీ ఏర్పడగా పరిస్థితి చేదాటిపోతుండటంతో రద్దీని అదుపుచేసేందుకు భద్రతాబలగాలు కాల్పులు జరగడంతో ఐదుగురు పౌరులు మృతిచెందినట్లు తెలుస్తోంది.

దేశ రాజధాని కాబుల్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారనే వార్త విన్న దేశ పౌరులు భయాందోళనకు గురవ్వడంతో విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని పౌర టెర్మినల్‌ కిక్కిరిసిపోయింది. ఒక్కో విమానం వద్ద వందల సంఖ్యలో ప్రజలు గుమిగూడిన నేపథ్యంలో రద్దీని అదుపుచేసేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •