వార్తలు (News)

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. తెలంగాణ కు వర్ష సూచన!!

తెలంగాణవ్యాప్తంగా సోమవారం(ఆగస్టు 16) పెద్దపల్లి,భూపాలపల్లి,ములుగు,భద్రాద్రి కొత్తగూడెం,వరంగల్ రూరల్,ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు, రాబోయే మూడు,నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. కరీంనగర్,మహబూబాబాద్,వరంగల్ అర్బన్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఈ నెల 17న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు, కరీంనగర్,సిరిసిల్ల ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణపై నైరుతి రుతుపవనాలు బలహీనంగా కొనసాగుతున్నట్లు తెలిపింది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఒడిశా తీరంలో 3.6కి.మీ నుంచి 7కి.మీ ఎత్తులో ఉందని తెలిపింది. అలాగే ఉత్తర ఛత్తీస్‌గఢ్‌లో మరో ఆవర్తనం ఏర్పడినట్లు తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే 3,4 రోజులు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •