ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) జాతీయం (National) వార్తలు (News)

పాఠశాలలు ప్రారంభించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోండి!!

పాఠశాలలు ప్రారంభించే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పిల్లల విషయంలో అత్యంత కేర్ ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెల్త్ ఆఫీసర్లు వివరించారు. చిన్నారుల్లో వైరస్ వ్యాప్తి జరిగితే ఎక్కువ మందికి శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, అంతేగాక మెడికేషన్ విధానంలో కూడా చాలా మార్పులు ఉంటాయని వైరస్ వ్యాప్తి జరిగిన తర్వాత బాధపడటం కంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని ఆరోగ్య శాఖ భావిస్తుంది.

ప్రతీ స్కూళ్లో థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ లో ఆయా యాజమాన్యాలు ఏర్పాటు చేయాలని సూచిస్తూ, గవర్నమెంట్ పాఠశాలలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తే బెటర్ అని వివరించింది. అంతేగాక ప్రతీ తరగతి గదిలో కేవలం 50 శాతం మాత్రమే సీటింగ్ విధానం ఉండాలన్నది. దీంతో పాటు ప్రతీ సర్కార్ పాఠశాలకు మాస్కులు, శానిటైజర్లను కూడా సమకూర్చాలన్నది.

ప్రతీ స్కూల్లో మెడికల్ రూమ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న డాక్టర్ ను సమన్వయం చేసుకునేలా స్కూళ్లకు నిబంధనలు పెట్టాలని, లక్షణాలు ఉన్న చిన్నారులను థర్మల్ స్క్రీనింగ్ అనంతరం సదరు మెడికల్ రూమ్ లో వైద్యుని పర్యవేక్షణలో ఉంచాలన్నది. దీంతో పాటు పాఠశాలలో పనిచేసే స్టాఫ్, టీచర్లు ప్రతీ పదిహేను రోజులకోసారి కరోనా టెస్టులు చేసుకోవాలన్నది. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వైరస్ వ్యవతి జరగకుండా ఆపాలని ఆరోగ్యశాఖ ప్రణాళికలు రచిస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    30
    Shares
  • 30
  •  
  •  
  •  
  •