అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

హ్యాకర్స్​ ను గడగడలాడించి లైబీరియన్ దేశ పరువు కాపాడిన 15 ఏళ్ళ కుర్రాడు??

నెల రోజుల క్రితం దేశ ఆర్థిక శాఖ అధికారిక వెబ్​సైట్​ సడెన్​గా కంట్రోల్ తప్పిపోయి ఏదేదో జరిగిపోతుండడంతో సమస్య ఉందని అధికారులు గ్రహించారు. వెంటనే అక్కడి సాంకేతిక నిపుణులను సంప్రదించారు. అయితే వారు ఏం చేయలేకపోయారు. ఎంత ప్రయత్నించినా వెబ్​సైట్​ను తమ చేతుల్లోకి తెచ్చుకోలేకపోయారు. దీంతో వెబ్​సైట్ హ్యాకింగ్ కు గురైందని అర్ధం చేసుకున్నారు. ఆ విషయం అక్కడి ప్రజలకు, ప్రతిపక్షాలకు తెలిస్తే అవమానం తప్పదు. ఈ తరుణంలో భారత్​ను సంప్రదించారు ఆ దేశపు​ సైబర్​క్రైమ్​ ప్రివెన్సన్​ అండ్​ మిటిగేషన్​ ఎజెన్సీ సిబ్బంది. ఇండియన్​ సైబర్​ సెక్యూరిటీ సొల్యూషన్స్​ కంపెనీ సాయం కోరారు. ఇంకేం ఇక్కడి ఓ హ్యాకర్​ వెంటనే ఆ వెబ్​సైట్​ ఐపీ తదితరాలు తనిఖీ చేయడం, తదుపరి విషయాలను ఆ దేశం ఎజెన్సీకి అందించడం చకచకా జరిగిపోయాయి.

ఆ దేశ సైబర్​ క్రైమ్​ నిపుణులు తమ ఆర్థిక శాఖ వెబ్​సైట్ ను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే అంతటి పెద్ద సమస్యను పరిష్కరించిన హ్యాకర్​ అంటే పెద్ద వయసు మళ్ళిన వృద్ధుడు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే! ఆ హ్యాకర్ వయసు కేవలం 15 ఏళ్లు. అవును పదిహేనేళ్ల కుర్రాడే. హేమాహేమీలు చేయలేని పని ఓ స్కూలు పిల్లాడు చేసి చూపించాడు.

లైబీరియన్(Liberian)​ ప్రభుత్వ ఆర్థిక, అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్​సైట్​ను హ్యాకర్స్​ తమ ఆధీనంలోకి తీసుకుని ప్రభుత్వం నుంచి డబ్బు వసూలు చేశారు. దీంతో సదరు హ్యాకర్​ను పట్టుకోవడానికి లైబీరియన్​ సైబర్ క్రైమ్​ ప్రివెన్సన్​ అండ్​ మిటిగేషన్​ ఏజెన్సీ భారత్​కు చెందిన కంపెనీని సంప్రదించారు. అయితే ఇండియన్ సైబర్​ సెక్యూరిటీ టీమ్​ ఈ కేసును పరిష్కరించేందుకు ఆ సంస్థలో సైబర్​ సెక్యూరిటీ నిపుణుడిగా గుర్తింపు పొందిన 15 ఏళ్ల సౌమ్య సాహుకు అప్పగించడంతోనే సాహు హ్యాకింగ్​కు సంబంధించిన డిజిటల్​ ఆధారాలను లైబీరియన్​ ప్రభుత్వానికి అందించాడు . దీంతో అధికారిక వెబ్​పేజీని లైబీరియన్​ ప్రభుత్వ ఆధీనంలోని వచ్చింది. అయితే అతడి పనికి మెచ్చిన లైబీరియా ప్రభుత్వం సాహూకు ప్రశంసా పత్రం, ఆ దేశంలో ఉద్యోగాన్ని(job) ఆఫర్​ చేసింది. మరికొన్ని అమెరికన్​ డాలర్లు కూడా పంపించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •